ప్రపంచవ్యాప్తంగా 27 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 27 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

Updated on: Sep 06, 2020 | 6:08 PM

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 27,101,359 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 884,376 మంది కరోనాతో చనిపోయారు. (Corona Cases In World)

ఇదిలా ఉంటే 19,216,198 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 2,69,358 పాజిటివ్ కేసులు, 4822 మరణాలు సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(6,432,209), మరణాలు(192,864) సంభవించాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 4,120,846 నమోదు కాగా, మృతుల సంఖ్య 70,732కి చేరింది.

Also Read: 

గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

రైల్వే ప్రయాణీకులకు తీపికబురు…

Loading...
Unable to load recommendations.
Follow Us