దేశంలో కొత్తగా 6,309 పాజిటివ్ కేసులు, 286 మరణాలు.. 96 శాతానికి చేరుకున్న రికవరీ రేటు..

దేశంలో గడిచిన 24 గంటల్లో 6,309 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,852 చేరుకుంది. ఇందులో 2,62,272 యాక్టివ్ కేసులు ఉండగా..

దేశంలో కొత్తగా 6,309 పాజిటివ్ కేసులు, 286 మరణాలు.. 96 శాతానికి చేరుకున్న రికవరీ రేటు..

Updated on: Dec 30, 2020 | 4:27 PM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 6,309 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,852 చేరుకుంది. ఇందులో 2,62,272 యాక్టివ్ కేసులు ఉండగా.. 98,34,141 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 286 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,48,439 కరోనా మరణాలు సంభవించాయి.

అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో శనివారం 26,572 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.56 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 95.99 శాతానికి రికవరీ రేటు చేరిందంది.

Loading...
Unable to load recommendations.
Follow Us