Corona Cases India: దేశంలో కొత్తగా 18,732 పాజిటివ్ కేసులు, 279 మరణాలు.. పెరుగుతున్న రికవరీ రేటు..
Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 18,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,87,850 చేరుకుంది.

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 18,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,87,850 చేరుకుంది. ఇందులో 2,78,690 యాక్టివ్ కేసులు ఉండగా.. 97,61,538 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 279 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,47,622 కరోనా మరణాలు సంభవించాయి.
అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో శనివారం 21,430 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.74 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 95.82 శాతానికి రికవరీ రేటు చేరిందంది. అలాగే గత ఆరు నెలల్లో రోజువారీ పాజిటివ్ కేసులు ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి.




