తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

దేశ రాజధాని డిల్లీలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మరింత పెరుగుతున్నాయి. కరోనా కేసులు తక్కవగా వస్తుండటంతో ఆంక్షలను నెమ్మదిగా తొలిగించే పనిలో పడింది ఢిల్లీ ప్రభుత్వం. అయితే ...

తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

Edited By:

Updated on: Aug 26, 2020 | 10:09 PM

దేశ రాజధాని డిల్లీలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మరింత పెరుగుతున్నాయి. కరోనా కేసులు తక్కవగా వస్తుండటంతో ఆంక్షలను నెమ్మదిగా తొలిగించే పనిలో పడింది ఢిల్లీ ప్రభుత్వం. అయితే  తాజాగా కేసుల సంఖ్య తిరిగి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,693 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,65,764కు చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇవాళ 1,154 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 1,48,897 మంది రికవర్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 17 మంది వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు 4,347 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 12,520మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us