ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన రెండు గంటల్లోనే పాజిటివ్

|

Jul 22, 2020 | 6:25 PM

కరోనా అనుమానంతో పరీక్షలు చేసుకున్నారు. టెస్టుల్లో నెగిటివ్ గా తేల్చిన వైద్యులు ఇంటిపంపించారు. గంటల వ్యవధిలో మరోసారి పరీక్షించిన వారికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా కార్మికుల్లో కంగారు మొదలైంది. జమ్మూకశ్మీర్‌లోని ఓ కూల్ డ్రింక్స్ ప్లాంట్‌లో పనిచేస్తున్న పన్నెండు మంది కార్మికులు కరోనా పాజిటివ్‌గా తేలారు. మొదటి పరీక్షల్లో నెగిటివ్ రాగా, రెండోసారి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన రెండు గంటల్లోనే పాజిటివ్
Follow us on

కరోనా అనుమానంతో పరీక్షలు చేసుకున్నారు. టెస్టుల్లో నెగిటివ్ గా తేల్చిన వైద్యులు ఇంటిపంపించారు. గంటల వ్యవధిలో మరోసారి పరీక్షించిన వారికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా కార్మికుల్లో కంగారు మొదలైంది.

జమ్మూకశ్మీర్‌లోని ఓ కూల్ డ్రింక్స్ ప్లాంట్‌లో పనిచేస్తున్న పన్నెండు మంది కార్మికులు కరోనా పాజిటివ్‌గా తేలారు. మొదటి పరీక్షల్లో నెగిటివ్ రాగా, రెండోసారి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. కూల్ డ్రింక్స్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఒకరు కరోనా బారినపడ్డారు. దీంతో మిగతా ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని భావించారు. ఫ్లాంట్ లోని అందరినీ స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కార్మికులు రెండు సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులోని 12 మంది కార్మికులకు తొలి సారి నెగెటివ్ అని రావడంతో ఆస్పత్రి సిబ్బంది వారిని ఇంటికి పంపించేశారు. రెండు గంటల తరువాత..రెండో కరోనా పరీక్ష ఫలితాలు రాగా అందులో పాజిటివ్ గా తేలింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే తాము నడుచుకున్నామని అక్కడి డాక్టర్లు చెప్పారు. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ వైరస్ బారిన పడుతున్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు కరోనా సోకిన కార్మికులను క్వారంటైన్ కి తరలించిన అధికారులు.. వారి కాంటాక్ట్ పై ఆరాతీస్తున్నారు. వైద్యుల రెండు రిపోర్టు కారణంగా కొత్త సమస్య వచ్చిపడిందని స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.