10 సెకండ్లలో 144 అంతస్తుల భవనం కూల్చివేత.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి..

144 అంతస్తుల భవనాన్ని పూర్తిగా కూల్చేయాలంటే చాలా సమయమే పడుతుంది. కానీ కేవలం 10 సెకండ్లలో అబూదాబీలో 144 అంతస్తుల భవనాన్ని కూల్చి వేశారు.

10 సెకండ్లలో 144 అంతస్తుల భవనం కూల్చివేత.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి..

Edited By:

Updated on: Dec 10, 2020 | 2:54 PM

Controlled demolition of UAE building: సాధారణంగా నాలుగైదు అంతస్తుల భవనాన్ని కూల్చాలంటేనే చాలా కష్టం. యంత్రాలు ఉపయోగించి శ్రమిస్తే దాదాపు వారంపది రోజులకు కూల్చి వేయవచ్చు. అయితే144 అంతస్తుల భవనాన్ని పూర్తిగా కూల్చేయాలంటే చాలా సమయమే పడుతుంది. కానీ కేవలం 10 సెకండ్లలో అబూదాబీలో 144 అంతస్తుల భవనాన్ని కూల్చి వేశారు. అక్కడి మినా జయేద్‌ ప్రాంతంలో 1972లో నిర్మించిన మినా ప్లాజా టవర్‌ను గత నెలలో కేవలం 10 సెకండ్లలోనే కూల్చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో బాంబులతో కూల్చివేసిన అత్యంత ఎత్తయిన భవనం ఇదే. అందుకే ఈ కూల్చివేత గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.