ఆర్ధిక శాఖ ముఖ్య కార్యాలయం వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

న్యూఢిల్లీలో జరిగిన షాకింగ్ సంఘటనలో అంతా ఉలిక్కి పడ్డారు. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయం వద్ద ఇవాళ ఓ హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన వ్యక్తి రాజస్థాన్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ(ఆర్ఏకే)కి చెందిన జై నారాయణ్‌గా గుర్తించారు. ఈ ఘటన ఇవాళ మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన జై నారాయణ్ తన సర్వీస్ రివాల్వర్‌తో షూట్ చేసుకుంటున్న విజువల్స్ సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటన జరిగే […]

ఆర్ధిక శాఖ ముఖ్య కార్యాలయం వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

Edited By:

Updated on: Jun 25, 2019 | 5:46 PM

న్యూఢిల్లీలో జరిగిన షాకింగ్ సంఘటనలో అంతా ఉలిక్కి పడ్డారు. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయం వద్ద ఇవాళ ఓ హెడ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన వ్యక్తి రాజస్థాన్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ(ఆర్ఏకే)కి చెందిన జై నారాయణ్‌గా గుర్తించారు. ఈ ఘటన ఇవాళ మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన జై నారాయణ్ తన సర్వీస్ రివాల్వర్‌తో షూట్ చేసుకుంటున్న విజువల్స్ సీసీటీవీలో రికార్డయింది.

ఈ ఘటన జరిగే సమయంలో ఇతడు నార్త్ బ్లాక్ రెండో నెంబర్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్నట్టుగా న్యూఢిల్లీ డీసీపీ మధుర్ వర్మ వెల్లడించారు. కాల్చుకున్న వెంటనే అతడ్ని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచినట్టుగా ఆయన తెలిపారు. అయితే జై నారాయణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియలేదని దీనికి సబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ మృతుడి వద్ద లభించలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us