కొడుకు చేసిన తప్పుడు పని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

|

Aug 10, 2020 | 5:35 PM

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు చేసిన తప్పడు పనిని జీర్ణించుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్రమ మద్యం తరలిస్తూ బుక్కైన కానిస్టేబుల్ కిరణ్ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొడుకు చేసిన తప్పుడు పని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
Follow us on

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు చేసిన తప్పడు పనిని జీర్ణించుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్రమ మద్యం తరలిస్తూ బుక్కైన కానిస్టేబుల్ కిరణ్ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చీరాలకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ తన బైక్‌పై తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తీసుకువస్తూ.. మద్దిపాడు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కిందపడిన కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం బాటిళ్లు అన్ని రోడ్డుపై పడిపోయాయి. స్థానికుల సమాచారం మేరుకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కిరణ్ నుండి తెలంగాణకు చెందిన 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కిరణ్ ను ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇదిలావుంటే కానిస్టేబుల్ కిరణ్ అక్రమ మద్యం తరలిస్తున్న పట్టుబడ్డాడని తండ్రి ప్రసాద్ కు తెలిసింది. కొడుకు చేసిన పనికి తండ్రి ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో చీరాల వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు ఉన్న కిరణ్ కోలుకుంటుండగా, అతనిపై అక్రమ మద్య రవాణా కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు.