మేమూ ఓటేశామన్న అవిభక్త కవలలు

ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ పౌరుడిగా ప్రతిఒక్కరి ప్రథమ కర్తవ్యం. కానీ ప్రస్తుతం ఎంతో మంది దానిని ఉపయోగించుకోవడం లేదు. అయితే బీహార్ రాజధాని పాట్నాలో తొలిసారిగా కవలలు ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. 19 ఏళ్ల వయస్సు గల సబా, ఫరా అనే ఇద్దరు పుట్టుకతోనే అవిభక్త కవలలు. అయితే వీరిద్దరికీ వేరువేరుగా ఓటు హక్కులు లభించడం విశేషం. తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని వీరు వినియోగించుకున్నారు. ఇవాళ ఏడవ విడత పోలింగ్‌ సందర్భంగా.. […]

మేమూ ఓటేశామన్న అవిభక్త కవలలు

Edited By:

Updated on: May 19, 2019 | 4:22 PM

ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ పౌరుడిగా ప్రతిఒక్కరి ప్రథమ కర్తవ్యం. కానీ ప్రస్తుతం ఎంతో మంది దానిని ఉపయోగించుకోవడం లేదు. అయితే బీహార్ రాజధాని పాట్నాలో తొలిసారిగా కవలలు ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. 19 ఏళ్ల వయస్సు గల సబా, ఫరా అనే ఇద్దరు పుట్టుకతోనే అవిభక్త కవలలు. అయితే వీరిద్దరికీ వేరువేరుగా ఓటు హక్కులు లభించడం విశేషం. తొలిసారిగా వచ్చిన అవకాశాన్ని వీరు వినియోగించుకున్నారు. ఇవాళ ఏడవ విడత పోలింగ్‌ సందర్భంగా.. సబ, ఫరాల చైతన్యం అందరినీ ఆకట్టుకుంది.