అప్పుడు వైఎస్‌ని అడ్డుకుంది.. టీడీపీయే..! : కేవీపీ ఫైర్

రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ని కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారాయన. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కూడా విచారణ చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను రాసిన బహిరంగ లేఖను కనీసం చదవకుండా కొందరు టీడీపీ నేతలు అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని ఇటీవల విమర్శించారు కేవీపీ. టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్‌గా కేవీపీ బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. సంబంధిత మంత్రికి అవగాహన […]

అప్పుడు వైఎస్‌ని అడ్డుకుంది.. టీడీపీయే..! : కేవీపీ ఫైర్

Edited By:

Updated on: May 16, 2019 | 8:49 PM

రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ని కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారాయన. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కూడా విచారణ చేపట్టాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను రాసిన బహిరంగ లేఖను కనీసం చదవకుండా కొందరు టీడీపీ నేతలు అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని ఇటీవల విమర్శించారు కేవీపీ. టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్‌గా కేవీపీ బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. సంబంధిత మంత్రికి అవగాహన లేకో.. వాస్తవాలు చెప్పడం ఇష్టం లేకో.. కానీ ఖర్చు గురించి తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదన్నారు కేవీపీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. పోలవరం కాలువలు తవ్వకుండా స్టేలు తెచ్చి, ఆందోళనలు చేసింది టీడీపీ నాయకులు కాదా అని కేవీపీ ప్రశ్నించారు.