మా ఫేస్‌బుక్ పేజీలన్నీ సేఫ్.. స్పష్టం చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుమారు 687 ఫేక్ అకౌంట్ ఎఫ్బీ పేజీలను.. ఫేస్‌బుక్ తొలగించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ పార్టీకి చెందిన అధికారిక ఫేస్‌బుక్ పేజీలు ఏవీ కూడా ఫేస్‌బుక్ తొలగించలేదని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పేర్కొంది. పార్టీ అనుమతి ఉన్న వాలంటీర్లు నడిపిస్తున్న ఎఫ్‌బీ పేజీలు కూడా సేఫ్‌గా ఉన్నాయని వెల్లడించింది. అనుచిత పద్ధతుల్లో సమాచారాన్ని చేరవేస్తున్న కాంగ్రెస్ అకౌంట్ పేజీలను తొలగించినట్లు ఇవాళ ఫేస్‌బుక్ సైబర్ సెక్యూరిటీ హెడ్ […]

మా ఫేస్‌బుక్ పేజీలన్నీ సేఫ్.. స్పష్టం చేసిన కాంగ్రెస్

Edited By:

Updated on: Apr 01, 2019 | 7:07 PM

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుమారు 687 ఫేక్ అకౌంట్ ఎఫ్బీ పేజీలను.. ఫేస్‌బుక్ తొలగించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ పార్టీకి చెందిన అధికారిక ఫేస్‌బుక్ పేజీలు ఏవీ కూడా ఫేస్‌బుక్ తొలగించలేదని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పేర్కొంది. పార్టీ అనుమతి ఉన్న వాలంటీర్లు నడిపిస్తున్న ఎఫ్‌బీ పేజీలు కూడా సేఫ్‌గా ఉన్నాయని వెల్లడించింది. అనుచిత పద్ధతుల్లో సమాచారాన్ని చేరవేస్తున్న కాంగ్రెస్ అకౌంట్ పేజీలను తొలగించినట్లు ఇవాళ ఫేస్‌బుక్ సైబర్ సెక్యూరిటీ హెడ్ న‌థానియ‌ల్ గ్లిచ‌ర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ సంస్థ నుంచి పూర్తి సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది.