వర్కర్ టీషర్టుపై మోదీ పేరు ఉందని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే.!

|

Apr 27, 2019 | 3:35 PM

దేశంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ పేరున్న టీషర్టు ధరించాడంటూ ఓ కార్మికుడిపై హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం చీఫ్ శ్యామ్ పిట్రోడా సమావేశానికి ఏర్పాట్లు జరుగుతుండగా, ఓ పనివాడు ధరించిన టీషర్ట్ అక్కడున్న కొందరు నేతల కంట్లో పడింది. ఆ టీషర్ట్ పై నరేంద్ర మోదీ పేరు ప్రచురించి […]

వర్కర్ టీషర్టుపై మోదీ పేరు ఉందని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే.!
Follow us on

దేశంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ పేరున్న టీషర్టు ధరించాడంటూ ఓ కార్మికుడిపై హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం చీఫ్ శ్యామ్ పిట్రోడా సమావేశానికి ఏర్పాట్లు జరుగుతుండగా, ఓ పనివాడు ధరించిన టీషర్ట్ అక్కడున్న కొందరు నేతల కంట్లో పడింది.

ఆ టీషర్ట్ పై నరేంద్ర మోదీ పేరు ప్రచురించి ఉండడంతో వాళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. 2018లో మోదీ బార్మర్ లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పంచిన టీషర్ట్ అది. దానిపై ఆనాటి వివరాలన్నీ ముద్రించారు. ఆ టీషర్ట్ ను ధరించి రావడమే ఆ కార్మికుడు చేసిన నేరమైంది. తమ పార్టీ ఆఫీసులో ప్రత్యర్థి పార్టీ టీషర్టు ధరించడం కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. వెంటనే ఆ కుర్రాడ్ని పార్టీ ఆఫీసు నుంచి పంపించేశారు.