ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి వెస్ట్ బెంగాల్‌లో హతులైన 50 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్వైట్ చేయాలని మోదీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మధ్య సుదీర్ఘంగా.. 5 గంటలపాటు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వీరు ఢిల్లీలో బీజేపీ నేతల ‘సంరక్షణ’ లో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఆహ్వానితుల జాబితా సిధ్ధమైందని, దీన్ని రాష్ట్రపతి భవన్ కు అందజేస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్ లో గత ఆరేళ్లలో జరిగిన పంచాయితీ, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు హతులయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే వీరిని పొట్టన బెట్టుకున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం అమిత్ షా.. హతులైన పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో కొన్నింటిని పరామర్శించారు. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..కాగా-మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు ఏడువేల మంది హాజరవుతున్నారు..
వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడురాహుల్ గాంధీ…సోనియాగాంధీ, గులాం నబీ ఆజాద్ కూడా ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
Congress President Rahul Gandhi to also attend Prime Minister Narendra Modi's oath ceremony tomorrow. https://t.co/lpb1mwi8MR
— ANI (@ANI) May 29, 2019