దాదాపు 12 ఏళ్ల నుంచి ఆయేషా మీరా హత్యపై దర్యాప్తులు జరుగుతూనే ఉన్నా.. నిందితులు ఎవరో మాత్రం తేలడం లేదు. తాజాగా.. దిశ హత్యచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం.. పాతుకుపోయిన కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఢిల్లీలోని నిర్భయ కేసు, విజయవాడలోని ఆయేషామీర హత్యాచారలపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ వస్తుండటంతో.. మళ్లీ వాటిని రీ ఓపెన్ చేశారు పోలీసులు.
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని.. ఆమె సరైన న్యాయం జరగాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో.. సీబీఐ అధికారులు.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆయేషా డెడ్ బాడీకి రీ పోస్ట్‌మార్టం చేయాలని నిర్ణయించారు. శనివారం.. ఢిల్లీ నుంచి వచ్చిన ఫారెన్సిక్ నిపుణులు బృందం.. ఆమె డెడ్ బాడీనుంచి ఎముకల అవశేషాలను సేకరించింది. కాగా.. ఇందులో భాగంగా.. ఆయేషా.. పుర్రెపై.. అస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించారు.
ఈ సందర్భంగా.. ఆయేషా మీర తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఆయేషా కేసులో పోలీసులే నిందితులని ఆరోపించారు. ఆయేషా కేసును త్వరగా ఛేదించాలని.. సీబీఐతో ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రాంతీయ, కులతత్వాల వల్లే కేసును నీరు గారుస్తున్నారన్నారు. సిట్ ఏర్పాటు వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదని వాపోయారు. ఆయేషా పేరుతో చట్టం తీసుకురావలని ఆమె తల్లి పేర్కొన్నారు.