ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు విక్రమ్ బాబు (54) గుండెపోటుతో మృతి చెందారు. స్థిరాస్తి వ్యాపారి అయిన విక్రమ్ బాబు పలు చిత్రాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఆయన నివాసం ఉంటున్నారు. తొమ్మిది రోజుల కిందటే ఆయన తన కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించారు. శుక్రవారం (జూన్ 28) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. విక్రమ్ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.