దీప్తి తులిని అలా వర్కౌట్ చేశాడట

కమెడియన్‌, రియాలిటీ షో 'ఖత్రోంకీ ఖిలాడీ' 10 ఫేం బాల్‌రాజ్‌ సియల్‌ కొత్త పెళ్లికొడుకయ్యాడు. బాలీవుడ్‌ సింగర్‌ దీప్తి తులిని అతడు వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ జలంధర్‌లో

దీప్తి తులిని అలా వర్కౌట్ చేశాడట

Updated on: Sep 06, 2020 | 4:45 PM

కమెడియన్‌, రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ’ 10 ఫేం బాల్‌రాజ్‌ సియల్‌ కొత్త పెళ్లికొడుకయ్యాడు. బాలీవుడ్‌ సింగర్‌ దీప్తి తులిని అతడు వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ జలంధర్‌లో ఆగష్టు 7న వీరి వివాహం జరిగింది. అయితే, ఇన్నాళ్లూ పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచిన బాల్‌రాజ్‌.. భార్య దీప్తితో కలిసి ఉన్న ఫొటోస్ ఇన్‌స్టాలో షేర్‌ చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక తమ ప్రేమ – పెళ్లి ముచ్చట్లను చెప్పుకొచ్చాడు బాల్ రాజ్. జూలై 2019 చండీఘడ్‌లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో తొలిసారి దీప్తిని కలిశానని. . తాను హోస్ట్‌ చేస్తున్న షోలో ఆమె తన మ్యూజిక్‌ బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతోందని వెల్లడించాడు. తొలి చూపులోనే ఆమె నచ్చేసిందని అయితే.. ఎందుకో ఆమెకు తాను నచ్చనేమో అనిపించేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఖత్రోంకీ ఖిలాడీ షో చేసే సమయంలో ఆమెకు మెసేజ్‌ చేశానని… అయినా కావాల్సిన రిప్లై లభించలేదని తన ప్రేమ పాట్లు వివరించాడు. అయినా వదల్లేదని. టర్కీ, గ్రీస్‌ టూర్‌కి వెళ్లినపుడు ఆమెతో పులిహోర కలిపి తన బర్త్‌డే రోజు (జనవరి 26) గోవాలో ఆమెకు ప్రపోజ్‌ చేసి నెమ్మదిగా వర్కౌట్ చేశానని చెప్పుకొచ్చాడు బాల్ రాజ్.