రూ. 10 నాణేలు చెల్లుతాయి.. ఆర్బీఐ క్లారిటీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2019 | 8:08 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో రూ. 10 నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. రూ. 10 నాణేలు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ఎన్నిసార్లు ప్రకటించినా ప్రజల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న చిన్ని దుకాణాల నుంచి బస్సుల్లోనూ ఆ నాణేలను అంగీకరించడం లేదు. అవి చలామణీలో ఉన్నప్పటికి చెల్లుతాయో లేదోనన్న అనుమానంతో చాలామంది వ్యాపారులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరోసారి స్పష్టతనిచ్చింది. రూ. 10 నాణేలతో పాటు చలామణిలో ఉన్న […]

రూ. 10 నాణేలు చెల్లుతాయి.. ఆర్బీఐ క్లారిటీ
Follow us on

తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో రూ. 10 నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. రూ. 10 నాణేలు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ఎన్నిసార్లు ప్రకటించినా ప్రజల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న చిన్ని దుకాణాల నుంచి బస్సుల్లోనూ ఆ నాణేలను అంగీకరించడం లేదు. అవి చలామణీలో ఉన్నప్పటికి చెల్లుతాయో లేదోనన్న అనుమానంతో చాలామంది వ్యాపారులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరోసారి స్పష్టతనిచ్చింది. రూ. 10 నాణేలతో పాటు చలామణిలో ఉన్న అన్ని రకాల నాణేలు కూడా ఇకపై చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. కొన్ని రకాల నాణేలను కొంత మంది వ్యాపారులు, బ్యాంకుల శాఖలు ఆమోదించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది. ఎప్పటి కప్పుడు తాము జారీ చేసిన అన్ని రకాల నాణేలను బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు అంగీకరించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.