Coronavirus Crisis: కరోనా మిగిల్చిన ఆర్థిక భారం.. 2,200 ఉద్యోగులకు కోత విధించిన కోకాకోలా

| Edited By: Ravi Kiran

Dec 18, 2020 | 5:11 PM

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. లాక్ డౌన్ కారణంగా ప్రపంచ బహుళ జాతి సంస్థలు సైతం వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి ఆర్థికంగా చతికిలాపడుతున్నాయి. తాజా బ్రీవరేజ్ దిగ్గజ సంస్థ కోకాకోలాపై పడింది.

Coronavirus Crisis: కరోనా మిగిల్చిన ఆర్థిక భారం..  2,200 ఉద్యోగులకు కోత విధించిన కోకాకోలా
Follow us on

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. లాక్ డౌన్ కారణంగా ప్రపంచ బహుళ జాతి సంస్థలు సైతం వ్యాపార లావాదేవీలు నిలిచిపోయి ఆర్థికంగా చతికిలాపడుతున్నాయి. తాజా బ్రీవరేజ్ దిగ్గజ సంస్థ కోకాకోలాపై పడింది. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం వల్ల కోకాకోలా అమ్మకాలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పునర్ నిర్మాణంలో భాగంగా 2021 సంవత్సరంలో 2,200 మంది ఉద్యోగాలను తగ్గించాలని కోకాకోలా యాజమాన్యం నిర్ణయించింది. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల అమెరికా దేశంలో 1,200 మంది కోకాకోలా ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా అమ్మకాలు పెద్దఎత్తున పడిపోయాయి. దీంతో నష్టాల నుంచి కంపెనీని గట్టేక్కించేందుకు ఉద్యోగుల భారం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే ఇది తన ట్యాబ్, ఓఢ్వాల్లా బ్రాండ్ ఉత్పత్తులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆగస్టులోనే అమెరికా, కెనడా, ప్యూర్టారికో దేశాల్లో వాలంటరీ లే ఆఫ్ ప్యాకేజీని సంస్థ ప్రకటించింది.కోకాకోలా మూడవ త్రైమాసిక లాభాల్లో 33 శాతం క్షీణించి 1.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. కోకాకోలాతోపాటు అమెరికా దేశంలోని పెద్ద కంపెనీలైన భీమా ఆల్స్టేట్, ఆయిల్ దిగ్గజ కంపెనీ ఎక్సాన్ మొబిల్, అమెరికన్ ఎయిర్ లైన్, యునైటెడ్ ఎయిర్ లైన్లలోనూ ఉద్యోగాల కోతలను ప్రకటించాయి.