ముంబైకి సీఎం కేసీఆర్ పయనం

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముంబై వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం ఫడ్నవీస్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వస్తుండంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా […]

ముంబైకి సీఎం కేసీఆర్ పయనం

Edited By:

Updated on: Jun 13, 2019 | 9:52 PM

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముంబై వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం ఫడ్నవీస్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వస్తుండంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగువేలమంది పోలీసులతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ భద్రత పెంచారు.