కరోనా ఎఫెక్ట్: టెన్త్‌ పరీక్షల నిర్వహణపై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణలో టెన్త్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. టెన్త్‌ పరీక్షలపై చర్చించి

కరోనా ఎఫెక్ట్: టెన్త్‌ పరీక్షల నిర్వహణపై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష

Updated on: Jun 07, 2020 | 5:58 PM

తెలంగాణలో టెన్త్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. టెన్త్‌ పరీక్షలపై చర్చించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే కరోనా వ్యాప్తి నివారణ చర్యలు.. లాక్‌డౌన్‌ అమలు అంశాలపై సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిద్-19 కేసులు రోజురోజుకూ ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి పరిధిలో పది పరీక్షలను నిలుపుదల చేయాలని హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. అయితే, రాష్ట్రంలో మిగతా చోట్ల మాత్రం షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహించుకోవచ్చునని సూచించింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే పది పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా వాయిదా వేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..  

 

Loading...
Unable to load recommendations.
Follow Us