ఈసీ నోటీసుపై కేసీఆర్‌ వివరణ

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఈ మేరకు వివరణతో కూడిన ప్రతిని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్‌కు టీఆర్‌ఎస్ నేతలు అందజేశారు.  కరీంనగర్‌ ఎన్నికల సభలో ఆయన చేసిన  వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ ఈ నోటీసు జారీ విషయం తెలిసిందే. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో […]

ఈసీ నోటీసుపై కేసీఆర్‌ వివరణ

Updated on: Apr 12, 2019 | 6:34 PM

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఈ మేరకు వివరణతో కూడిన ప్రతిని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్‌కు టీఆర్‌ఎస్ నేతలు అందజేశారు.  కరీంనగర్‌ ఎన్నికల సభలో ఆయన చేసిన  వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ ఈ నోటీసు జారీ విషయం తెలిసిందే. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో శుక్రవారం సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్‌ తన వివరణను పంపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us