ఇవాళ జరిగే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరుకాబోతున్నారు. నోముల స్వగ్రామం పాలెంలోని..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరుకాబోతున్నారు. నోముల స్వగ్రామం పాలెంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ జరగనున్న ఈ కార్యక్రమాన్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఇందుకోసం సీఎం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో ఉదయం10 గంటల 50 నిమిషాలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరి 10 గంటల 55 నిమిషాలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 11 గంటల 25 నిమిషాలకు పాలెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలు ముగిసే వరకు ఉంటారు.12 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై 12 గంటల 30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.