అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : జగన్, రేవంత్ రెడ్డి

ఎంఐఎం సీనియర్ నాయకుడు, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 2011 ఏప్రిల్‌లో బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. తీవ్ర గాయాలకు గురైన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇటీవల కొత్త సమస్య తలెత్తడంతో గత నెల 5న చికిత్స కోసం కుటుంబసమేతంగా లండన్‌కు […]

అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : జగన్, రేవంత్ రెడ్డి

Edited By:

Updated on: Jun 11, 2019 | 11:59 AM

ఎంఐఎం సీనియర్ నాయకుడు, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

2011 ఏప్రిల్‌లో బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. తీవ్ర గాయాలకు గురైన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇటీవల కొత్త సమస్య తలెత్తడంతో గత నెల 5న చికిత్స కోసం కుటుంబసమేతంగా లండన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.