AP idols demolition: విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఆలయాల ధ్వంసంపై సీఎం జగన్ కామెంట్స్

|

Jan 11, 2021 | 5:42 PM

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక కడుపు మంటలో ఆలయాల ధ్వంసం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు.

AP idols demolition: విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఆలయాల ధ్వంసంపై సీఎం జగన్ కామెంట్స్
Follow us on

AP idols demolition:  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక కడుపు మంటలో ఆలయాల ధ్వంసం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాన్యులకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటున్నారని విమర్శించారు. విద్రోహ శక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని సీఎం అన్నారు.  నెల్లూరు జిల్లాలో అమ్మ ఒడి పథకం రెండో విడత నిధుల చెల్లింపులను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం చేసిన ప్రసంగంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

‘విగ్రహాలను ఎవరు ధ్వంసం చేయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.. ధ్వంసమైన విగ్రహాలు చూస్తామని ఎందుకు వెళుతున్నారో అర్థం చేసుకోండి. రథాలు ఎందుకు తగులబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్ర ఎందుకు చేయబోతున్నారో గమనించండి’ అని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి జగన్.

Also Read:

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Fire accident: హైదరాబాద్​ ఎల్బీ స్టేడియం పరిధిలోని పబ్లిక్ టాయ్‌లెట్‌లో మంటలు.. స్థానికంగా కలకలం