వరద ప్రభావిత జిల్లాల్లో.. సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే!

| Edited By:

Aug 18, 2020 | 5:09 PM

ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఏపీ సీఎం‌ జగన్ మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

వరద ప్రభావిత జిల్లాల్లో.. సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే!
Follow us on

ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఏపీ సీఎం‌ జగన్ మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

భారీ వర్షాల కారణంగా.. పోలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. జిల్లాల్లో వరద పరిస్థితులపై సీఎం జగన్, కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నానని’ ఆయన తెలిపారు.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!