తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత..!

| Edited By:

May 31, 2019 | 11:45 AM

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రేగిన స్వల్ప వివాదం ఘర్షణ స్థాయికి చేరింది. పరస్పరం ఇరువార్గాల నినాదాలతో పోలింగ్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రంగ ప్రవేశం చేయడంతో ఇది మరింత హీటెక్కింది. ఘర్షణకు తలబడనున్న ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హాస్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారంటూ కాంగ్రెస్ […]

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత..!
Follow us on

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రేగిన స్వల్ప వివాదం ఘర్షణ స్థాయికి చేరింది. పరస్పరం ఇరువార్గాల నినాదాలతో పోలింగ్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రంగ ప్రవేశం చేయడంతో ఇది మరింత హీటెక్కింది. ఘర్షణకు తలబడనున్న ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

ఆర్ అండ్ బీ గెస్ట్ హాస్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఆరోపణ ఈ వివాదానికి దారి తీసింది. అక్కడి నుంచి ఆ అభ్యర్థిని పంపి వేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఒకదశలో కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్పంగా లాఠీచార్జి చేశారు.