పందిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ

|

Oct 31, 2020 | 10:50 PM

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గ్రూపుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

పందిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ
Follow us on

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గ్రూపుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బలరాం కృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా చీరాల నుంచి పందిళ్లపల్లి వరకూ శనివారం సాయంత్రం ఆయన వర్గీయులు బైక్ ర్యాలీ చేపట్టారు. అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్‌ తన అనుచరులతో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తన ఇంట్లో సమావేశం నిర్వహిస్తున్నారు.  ఆమంచి ఇంటి ఎదురుగా ర్యాలీ వెళుతుండగా ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది.  ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.  ర్యాలీపై ఆమంచి వర్గీయులు రాళ్లు వేశారని కరణం అనుచరులు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. చీరాల ఇంఛార్జ్ డీఎస్పీ వేణుగోపాల్, మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆమంచి గ్రూపులోని చెరుకూరి ఏసు అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది.  పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Also Read :

ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..

ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య