పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడుల గురించి తెలిసిందే. ఇప్పటికే అక్కడి హిందూ యువతులను, మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి.. బలవంతపు మత మార్పిడిలు చేసి వివాహాలు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అక్కడి హిందువుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం కావాలంటే మతం మారాలంటూ బలవంతగా మత మార్పిడులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నేపాల్‌లోని హిందువులు పాక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌లో హిందువులపై దాడులను ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఖాట్మండులోని పాక్ ఎంబసీ సమీపంలో నేపాలీయులు శుక్రవారం నాడు నిరసన తెలిపారు. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులను ప్రదర్శించారు.
Nepal: People hold protest at Chakrapath Chowk near Pakistani embassy in Kathmandu over atrocities against Hindus in Pakistan. pic.twitter.com/qMR1iEMtFF
— ANI (@ANI) August 14, 2020
Read More :