Breaking News: సిటీ బస్సులు నడిపేందుకు రెడీ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులు నడిపేందుకు రెడీ అంటోంది టీఎస్ఆర్టీసీ. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు టీఎస్ఆర్టీసీ అధికారులు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన...

Breaking News: సిటీ బస్సులు నడిపేందుకు రెడీ

Updated on: May 24, 2020 | 11:36 AM

TSRTC is gearing up to run city buses in greater Hyderabad area: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులు నడిపేందుకు రెడీ అంటోంది టీఎస్ఆర్టీసీ. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు టీఎస్ఆర్టీసీ అధికారులు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో బస్సులు నడిపేందుకు తాము రెడీ అయి, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని అధికారులు ఆదివారం ప్రకటించారు. దాంతో ప్రభుత్వ నిర్ణయమే ఇపుడు కీలకంగా మారింది.

సిటీలో ఆర్టీసీ సిటీ బస్సులు నడపడానికి టీఎస్ఆర్టీ రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను సోమవారం నుంచి విధులకు హాజరు కావాలంటూ కాల్ లెటర్లు పంపారు అధికారులు. దేశీయ విమానాలు నడుస్తుండటంతో ఎయిర్ పోర్టు వైపు బస్సులను పునరుద్ధరించే దిశగా చర్చలు ప్రారంభించారు. ప్రభుత్వ అనుమతి వస్తే డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం బస్సులు నడవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా టిఎస్ఆర్టిసి అధికారులు.

దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వందశాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతించడంతో, నగరంలో జన సంచారం బాగా పెరిగింది. దానికి తోడు దుకాణాలు కూడా 50శాతం తెరవడంతో పలువురికి సిటీ బస్సుల అవసరం కనిపిస్తోంది. ఈ కీలక సమయంలో బస్సులు నడపకుండా ఆదాయం కోల్పోవడం ఎందుకని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్టమైన మార్గదర్శకాలను పాటిస్తూ బస్సులను నడిపేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఓకే అంటే సోమవారం అంటే మే 25వ తేదీ నుంచి గ్రేటర్ పరిధిలో బస్సులు నడిచే ఛాన్స్ వుంది.