ప్రభాస్‌పై అభిమానం.. విలన్‌పై చెప్పుతో కోపం!

‘బాహుబలి 1&2’ సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన డార్లింగ్.. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించకపోయినా.. హిందీలో బిగ్ హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. దీనికి ప్రభాస్ క్రేజ్ ముఖ్య కారణం. సినిమా నెగటివ్ టాక్.. మిక్స్‌డ్ రివ్యూస్ వస్తేనే ఇలాంటి వసూళ్లు సాధించిందంటే.. హిట్ టాక్ సొంతం చేసుకుంటే కలెక్షన్స్‌కు ఆకాశమే హద్దు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఫాలోయింగ్ గురించి మరో […]

ప్రభాస్‌పై అభిమానం.. విలన్‌పై చెప్పుతో కోపం!

Edited By:

Updated on: Sep 28, 2019 | 2:23 PM

‘బాహుబలి 1&2’ సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన డార్లింగ్.. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించకపోయినా.. హిందీలో బిగ్ హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. దీనికి ప్రభాస్ క్రేజ్ ముఖ్య కారణం. సినిమా నెగటివ్ టాక్.. మిక్స్‌డ్ రివ్యూస్ వస్తేనే ఇలాంటి వసూళ్లు సాధించిందంటే.. హిట్ టాక్ సొంతం చేసుకుంటే కలెక్షన్స్‌కు ఆకాశమే హద్దు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఫాలోయింగ్ గురించి మరో ఇంటరెస్టింగ్ విషయం తాజాగా బయటకు వచ్చింది.

‘సాహో’లో దేవరాజ్ అనే పాత్రలో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర వల్ల ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఇటీవల ప్రభాస్ అభిమానితో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. ఒక పెద్ద వయసు మహిళ చుంకీ పాండేకి నాలుగు తగిలించాలని చెప్పు పట్టుకొచ్చిందట.  ఇంతకీ ఆమెకు ఎందుకు కోపం వచ్చిందంటే.. ‘సాహో’ లో ఒక సీన్ లో చుంకీ హీరో ప్రభాస్ ను చంపేందుకు ప్రయత్నిస్తూ మెడను విరుస్తాడు. అది ఆమెకు నచ్చలేదు. తన అమితంగా అభిమానించే హీరోను ఇలా చేస్తారా అంటూ తనదైన శైలిలో బుద్ది చెప్పాలని డిసైడ్ అయిందట.

ఇక్కడ మనం సంతోషించదగ్గ విషయం ఏమిటంటే.. బాహుబలి సిరీస్‌తో హిందీ ప్రేక్షకులు ప్రభాస్‌ను తమ సొంత హీరోలా భావిస్తున్నారు. అంతేకాక సినిమాలో చుంకీ పాండే తన పాత్రలో ఇంతలా జీవిస్తే తప్ప.. ఇలాంటి సంఘటన ఎదురవ్వదు.