Chiranjeevi Acharya movie Laahe Laahe song : మెగా ఫ్యాన్స్ కోసం శాంపిల్ వదిలిన ఆచార్య, రేపిక బంపరాఫరే..

|

Mar 31, 2021 | 8:17 PM

Chiranjeevi Acharya movie Laahe Laahe song promo : ఏ వయసులోనైనా రెచ్చిపోయి డ్యాన్స్ చేయడలో అతనికతనే సాటి. అదీ.. అతని స్టామినా...

Chiranjeevi Acharya movie Laahe Laahe song : మెగా ఫ్యాన్స్ కోసం శాంపిల్ వదిలిన ఆచార్య, రేపిక బంపరాఫరే..
Acharya
Follow us on

Chiranjeevi Acharya movie Laahe Laahe song promo : ఏ వయసులోనైనా రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంలో అతనికతనే సాటి. అదీ.. అతని స్టామినా. తెలుగు చిత్రసీమలో అందుకే ఇప్పటికీ దిగ్గజంలా వెలుగొందుతున్నారు. ఇంకెవరు.. అతనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మెగా ఫ్యాన్స్ కు మరో బంపరాఫర్ ఇచ్చారు చిరు. మరోసారి మెగా మ్యాజిక్‌ను చూసేందుకు అభిమానులూ రెడీ అయిపోండంటూ తాజా సాంపిల్ వదిలారు చిరంజీవి.

మెగాస్టార్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీ లోని ‘లాహే.. లాహే..’ అంటూ సాగే సాంగ్ రేపు సాయంత్రం రిలీజ్ చేస్తున్నామంటూ ఇప్పుడు శాంపిల్ గా సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. కేవలం 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక్క స్టెప్‌తోనే చిరు మెస్మరైజ్‌ చేసేశారు. ఇక పూర్తి సాంగ్‌లో ఎలా అదరగొడతారో చూసేందుకు రేపు సాయంత్రం వరకూ ఆగాల్సిందే. ఆచార్య సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read also : Joyce George on Rahul : రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లొద్దు, అతనికసలే పెళ్లి కాలేదు: అమ్మాయిలకు కేరళ మాజీ ఎంపి వార్నింగ్