చిరాగ్ పాశ్వాన్ ‘తొండాట’ ! నితీష్ కి మూడో స్థానమే సరి!

బీహార్ ఎన్నికల్లో ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ఆడిన ‘తొండాట’ కారణంగా సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారాయి.  జేడీ-యూ పోటీ చేసిన ప్రతిచోటా చిరాగ్ గారు తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల్లో నితీష్ ఓటమే తమ ధ్యేయమని ఇదివరకే ప్రకటించారు. ఈయన తమ పార్టీ అభ్యర్థులను జెడి-యూ పోటీ చేసిన అన్ని సీట్లలోనూ నిలబెట్టకపోయి ఉంటే నితీష్ పార్టీ కనీసం ఏకైక అతి పెద్ద పార్టీగా కాకపోయినా రెండో […]

చిరాగ్ పాశ్వాన్ తొండాట ! నితీష్ కి మూడో స్థానమే సరి!

Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 4:14 PM

బీహార్ ఎన్నికల్లో ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ఆడిన ‘తొండాట’ కారణంగా సీఎం నితీష్ కుమార్, ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారాయి.  జేడీ-యూ పోటీ చేసిన ప్రతిచోటా చిరాగ్ గారు తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల్లో నితీష్ ఓటమే తమ ధ్యేయమని ఇదివరకే ప్రకటించారు. ఈయన తమ పార్టీ అభ్యర్థులను జెడి-యూ పోటీ చేసిన అన్ని సీట్లలోనూ నిలబెట్టకపోయి ఉంటే నితీష్ పార్టీ కనీసం ఏకైక అతి పెద్ద పార్టీగా కాకపోయినా రెండో స్థానంలో వచ్చి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. నితీష్ ని జూనియర్ పార్ట్ నర్ గా దిగజార్చేందుకు బీజేపీ పరోక్షంగా చేసిన ప్రయత్నానికి చిరాగ్ పాశ్వాన్ కూడా తోడ్పడ్డారు. తొలిసారిగా ఆయన ఆడిన ‘విచిత్రమైన ‘ ఆటతో బీజేపీ బాగా లాభపడింది. తన ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది.