అక్కడి సౌకర్యాలు ఇక్కడ ఎలా..? సీఏఏపై చిన జీయర్ స్వామీజీ..

| Edited By:

Jan 05, 2020 | 5:09 AM

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓ వైపు చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుంటే.. మరోవైపు క్రమక్రమంగా మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా సీఏఏ అంశంపై చిన జీయర్ స్వామి స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రతి ఒక్కరు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేకుండా దీనిని సమర్థించవలసిందేనన్నారు. ఏ దేశమైనా అక్కడి రాజ్యాంగం, చట్టాలకు లోబడని వారు.. ఆ దేశ సౌకర్యాలను అనుభవించడానికి అర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు. అమెరికాలోని హ్యూస్టన్‌లోని […]

అక్కడి సౌకర్యాలు ఇక్కడ ఎలా..? సీఏఏపై చిన జీయర్ స్వామీజీ..
Follow us on

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓ వైపు చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుంటే.. మరోవైపు క్రమక్రమంగా మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా సీఏఏ అంశంపై చిన జీయర్ స్వామి స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రతి ఒక్కరు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేకుండా దీనిని సమర్థించవలసిందేనన్నారు. ఏ దేశమైనా అక్కడి రాజ్యాంగం, చట్టాలకు లోబడని వారు.. ఆ దేశ సౌకర్యాలను అనుభవించడానికి అర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు.

అమెరికాలోని హ్యూస్టన్‌లోని అష్టలక్ష్మీ ఆలయంలో జరిగిన ధనుర్మాసం ఉత్సవాల్లో పాల్గొన్న స్వామీజీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.దేశంలోని ప్రతీపౌరుడు చట్టబద్ధంగా తన బాధ్యతను తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా.. ఈ “సీఏఏ”ని రూపొందించారన్నారు. ఈ దేశ పౌరులు కానివారికి ఓటు, నివాసం, స్థలం కొనుగోలు, వ్యాపారం చేసుకునే హక్కులు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయ బేధాలు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు స్వామీజీ.