టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లపై అమెరికా నిషేధం

|

Sep 18, 2020 | 7:25 PM

ట్రంప్​ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ట్రంప్ సర్కార్ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లపై  అమెరికా నిషేధం
Follow us on

ట్రంప్​ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ట్రంప్ సర్కార్ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆదివారం సెప్టెంబర్ 20 నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్​ లు డౌన్ ​లోడ్​ చేసుకొనేందుకు వీలులేదంటూ యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ తెలిపింది. చైనాకు చెందిన టెన్సెంట్ తో సహా బైట్ డాన్స్ కంపెనీలకు చెందిన ఈ రెండు యాప్ లు iOS యాప్ స్టోర్ తో పాటు గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని అమెరికా తెలిపింది. ఆ రెండు కంపెనీలు యుఎస్ లో హోస్ట్ చేయకుండా నిషేధం విధిస్తున్న అమెరికా సర్కార్ పేర్కొంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నామని అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ తెలిపారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ… అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థను బెదిరించడానికి ఈ యాప్ లను ఉపయోగించుకునే మార్గాలను ఆయన తెలిపారు.

గతంలోనే తమ దేశ టిక్‌ టాక్‌ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ.. సమాచార భద్రతపై గతంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో యాప్.. యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించేలా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా.. బైట్‌ డ్యాన్స్‌ అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఒరాకిల్​- బైట్​డాన్స్​ల మధ్య ఒప్పందం కోసం చర్చలు జరిగినా.. పొత్తు కుదరలేదని తెలుస్తోంది. టిక్‌టాక్‌కు అమెరికాలో 8 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉండగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.