కపటనాటక సూత్ర‌ధారి చైనా..క‌రోనాపై అన్ని అవాస్త‌వాలే..!

కరోనా వైరస్‌ కాటేయటం మొదలుపెట్టిన దగ్గర్నుంచి, చైనాను ప్రపంచం అనుమానంగానే చూస్తోంది. ట్రంప్‌తో మొదలు పెట్టి కొందరు దేశాధినేతలు కూడా చైనాపై అనేక డౌట్లను వ్యక్తం చేశారు. ఇప్పుడు హాంకాంగ్‌ యూనివర్సిటీ బృందం చేసిన అధ్యయనం ప్రకారం – అధికారిక లెక్కల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. చైనాలో కేసులెన్ని? మరణాలెన్ని ? 75శాతం కేసులను దాచి పెడుతోందా? ఒక వంతు మాత్రమే బయటికి చెప్పిందా? మళ్లీ వెట్‌మార్కెట్‌ను ఓపెన్‌ చేశారా? కరోనాకు […]

కపటనాటక సూత్ర‌ధారి చైనా..క‌రోనాపై అన్ని అవాస్త‌వాలే..!

Updated on: Apr 25, 2020 | 7:39 PM

కరోనా వైరస్‌ కాటేయటం మొదలుపెట్టిన దగ్గర్నుంచి, చైనాను ప్రపంచం అనుమానంగానే చూస్తోంది. ట్రంప్‌తో మొదలు పెట్టి కొందరు దేశాధినేతలు కూడా చైనాపై అనేక డౌట్లను వ్యక్తం చేశారు. ఇప్పుడు హాంకాంగ్‌ యూనివర్సిటీ బృందం చేసిన అధ్యయనం ప్రకారం – అధికారిక లెక్కల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. చైనాలో కేసులెన్ని? మరణాలెన్ని ? 75శాతం కేసులను దాచి పెడుతోందా? ఒక వంతు మాత్రమే బయటికి చెప్పిందా? మళ్లీ వెట్‌మార్కెట్‌ను ఓపెన్‌ చేశారా? కరోనాకు సంబంధించి చైనా చెబుతున్న విషయాలను ప్రపంచం పూర్తిగా నమ్మటం లేదు.

ఇప్పుడు ఒక హాంకాంగ్‌ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం ప్రకారం – చైనా చెబుతున్న లెక్కల కంటే, నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్‌ యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఒక రిపోర్టును ప్రచురించింది. దీని ప్రకారం కరోనా విరుచుకుపడిన తొలిదశలో 2,30,000 మందికి వైరస్‌ సోకింది. అయితే అదే సమయంలో – కేవలం 55 వేల మంది మాత్రమే వ్యాధి బారిన పడ్డారని చెనా చెప్పింది. ఫిబ్రవరి 20వ తేదీన ఈ లెక్కను అధికారికంగా ప్రకటించింది. చైనా అధికారిక గణాంకాల ప్రకారం – ఇప్పటివరకూ 83,878 కేసులు, 4,636 మరణాలు నమోదయ్యాయి. అయితే ఈ లెక్కల మీద చాలామంది వైద్యాధికారులకు, విశ్లేషకులకూ అనుమానాలున్నాయి. కానీ లాన్సెట్‌ ప్రచురించిన హాంకాంగ్‌ ప్రొఫెసర్ల నివేదిక, అంతకు నాలుగురెట్లు కేసులు నమోదయ్యాయని చెబుతోంది. 75శాతం కేసులను దాచి పెడుతున్నారని ఆ రిపోర్టు విమర్శించింది. అసలు ఎన్నికేసులు నమోదయ్యాయి, ఎంతమంది చనిపోయారన్న విషయంపై – స్వతంత్ర దర్యాప్తుకి చైనా ఒప్పుకోవటం లేదు.

మరోవైపున కొన్ని మిలియన్ల ఫోన్లు పనిచేయటం లేదని, టెలికాం కంపెనీలు చెబుతున్న విషయాన్ని కూడా ఈ రిపోర్టు ప్రస్తావించింది. బహుశా వారంతా చనిపోయివుండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక బాధిత కుటుంబాలు స్మశానవాటికలనుంచి , రోజుకి 3వేల చితాభస్మకలశాలను తెచ్చుకుంటున్నారని – దీన్ని బట్టి కూడా మృతుల సంఖ్యను అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. చైనా కరోనా కేసులను నమోదు చేసే విషయంలో తన ధోరణి మార్చుకుంది. పైకి కనిపించకుండా అంతర్గతంగా వైరస్‌ లక్షణాలున్నవారిని, తేలికపాటి లక్షణాలున్నవారిని అధికారికంగా నమోదు చేయలేదని హాంకాంగ్‌ యూనివర్సిటీ నిపుణులు అంటున్నారు.

పోయిన వారం , వూహాన్‌లో మరణాలు 50శాతం పెరిగాయని చెబుతున్నారు. కేసుల నమోదు విషయంలో చైనా తన ధోరణి మార్చుకుంటూ వచ్చిందని, దీనివల్ల అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువ కేసులు ఉండే అవకాశముందని వారు భావిస్తున్నారు. ఇక వూహాన్‌లో వైరస్‌ పుట్టుకకి కారణమని భావిస్తున్న వెట్‌ మార్కెట్‌లను మళ్లీ తెరిచారు. దాదాపు 90శాతం మార్కెట్లను తెరిచారని , ఏప్రిల్‌ 17న ఒక ట్రావెల్‌ బ్లాగర్‌ వీడియో పెట్టాడు. జంతువుల తాజా మాంసం, సీఫుడ్‌, చేపలు ఈ మార్కెట్లలో అమ్ముతుంటారు. కానీ , ఆస్ట్టేలియా నుంచి అమెరికా వరకూ అందరూ వీటిని మూసేయమంటున్నారు. వీటివల్లే వైరస్‌ వ్యాపిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ మాత్రం , వెట్‌ మార్కెట్లపై ఆధారపడి లక్షలాది ప్రజలు జీవిస్తున్నారని చెబుతోంది. అయితే పరిశుభ్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని కోరుతోంది .ఈ మార్కెట్లలో కూరగాయలు, గుడ్లు, సీఫుడ్‌ మాత్రమే ఉంటాయని చైనా చెబుతోంది. ఇక జనం తినదగిన జంతువుల నుంచి కుక్కలను మినహాయించింది సర్కారు.