తైవాన్ దురాక్రమణకు చైనా అడుగులు..!
తూర్పు లద్దాఖ్‌లో భారత్ గిల్లికజ్జాలు దిగితున్న డ్రాగన్ కంట్రీ .. మరోవైపు తైవాన్ కబ్జాకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆగ్నేయ తీరంలో చైనా సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది.
తూర్పు లద్దాఖ్‌లో భారత్ గిల్లికజ్జాలు దిగితున్న డ్రాగన్ కంట్రీ .. మరోవైపు తైవాన్ కబ్జాకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆగ్నేయ తీరంలో చైనా సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. ఇదంతా తైవాన్ దురాక్రమణ కోసమేనని రక్షణ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. తాజాగా చైనా సైన్యం తాజాగా తన పాత డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణులను తొలగించి, అధునాతనమైన హైపర్‌సోనిక్ డీఎఫ్-17 క్షిపణులను ఈ ప్రాంతంలో మోహరిస్తోంది. ఈ కొత్త అస్త్రాలు సుదూర లక్ష్యాలను సునాయసంగా ఛేదిస్తాయి. వీటికి ఖచ్చితత్వం కూడా చాలా ఎక్కువే.
నిజానికి తైవాన్ ఎన్నడూ చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనలో లేదు. స్వీయ పాలనలో కొనసాగుతోంది. అయినా, ఆ ప్రాంతాన్ని తమ అంతర్భాగంగా చైనా అధికారులు మొండిగా వాదిస్తున్నారు. మరోవైపు, తైవాన్‌ను చేజిక్కించుకునేందుకు సైనిక చర్య అవకాశాన్ని కొట్టిపారేయలేమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని ఫుజియాన్, గువాంగ్‌డాంగ్‌లోని మెరీన్ కోర్, రాకెట్ ఫోర్స్ బలగాలను డ్రాగన్ భారీగా పెంచినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ రెండు స్థావరాల్లో ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఆయుధాలను చేరవేరుస్తోంది.
ఇదిలావుంటే, కొవిడ్-19 మహమ్మారి అంశాలపై అమెరికాతో చైనాకు తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తైవాన్ యూఎస్ కు అండగా నిలిచింది. దీంతో చైనా తైవాన్ దురాక్రమణకు డ్రాగన్ వేగంగా పావులు కదుపుతుంది. గత వారం గువాంగ్‌డాంగ్‌లోని ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. యుద్ధ సన్నద్ధత కోసం సర్వశక్తులను కూడగట్టాలని బలగాలకు పిలుపునిచ్చారు. దీంతో మరోవైపు ఎత్తుగడ ప్రపంచానికి స్పష్టమవుతుంది.