కైలాస మానసరోవరం వద్ద చైనా నిర్మాణాలు, శకటాలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 22, 2020 | 9:15 PM

'కైలాస శిఖరం' వద్ద చైనా తన సైనిక నిర్మాణాలు చేపడుతోంది. కైలాస మానసరోవర్ ప్రాంతంలో హిందువుల మతపరమైన పవిత్ర స్థలాలు, మందిరాల సమీపంలో ఆ దేశ కట్టడాలు కనిపిస్థున్నట్టు..

కైలాస మానసరోవరం వద్ద చైనా నిర్మాణాలు, శకటాలు
Follow us on

‘కైలాస శిఖరం’ వద్ద చైనా తన సైనిక నిర్మాణాలు చేపడుతోంది. కైలాస మానసరోవర్ ప్రాంతంలో హిందువుల మతపరమైన పవిత్ర స్థలాలు, మందిరాల సమీపంలో ఆ దేశ కట్టడాలు కనిపిస్థున్నట్టు శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. అక్కడ డ్రాగన్ కంట్రీ హెవీ మిలిటరీని చూసి భక్తులు బెంబేలెత్తుతున్నారు. సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తున గల 80 కి.మీ. పొడవునా గల రోడ్డు మార్గంలో చైనా సైనిక శకటాలు కనిపిస్తున్నాయి. పైగా భూతలంపైనుంచి ఆకాశంలో గల టార్గెట్లను ఛేదించగల మిసైళ్లను కూడా చైనా మోహరించింది. ఇప్పటికే లడాఖ్ వద్ద చైనా చొరబాటును ఖండిస్తున్న ప్రభుత్వం ఈ తాజాపరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.