నేపాల్ భూభాగంలో చైనా భవనాలు, నేపాలీలకు నో ఎంట్రీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 21, 2020 | 3:44 PM

నేపాల్ భూభాగాల్లోకి చైనా చొచ్ఛుకువస్తోంది. ఇండియాకు లడాఖ్ లో బోర్డర్ సమస్యను తెఛ్చిపెడుతూ అదే సమయంలో నేపాల్ లో ఆక్రమణల పర్వానికి చైనా తెర తీసింది. ఈ దేశంలోని హుమ్లా జిల్లా నాంక్యా గ్రామంలో ఏకంగా 9 భవనాలను..

నేపాల్ భూభాగంలో చైనా భవనాలు, నేపాలీలకు నో ఎంట్రీ
Follow us on

నేపాల్ భూభాగాల్లోకి చైనా చొచ్ఛుకువస్తోంది. ఇండియాకు లడాఖ్ లో బోర్డర్ సమస్యను తెఛ్చిపెడుతూ అదే సమయంలో నేపాల్ లో ఆక్రమణల పర్వానికి చైనా తెర తీసింది. ఈ దేశంలోని హుమ్లా జిల్లా నాంక్యా గ్రామంలో ఏకంగా 9 భవనాలను చైనా అక్రమంగా నిర్మించింది. పైగా అక్కడికి నేపాలీయులెవరూ రాకుండా ఆంక్షలు విధించింది. ఈ గ్రామ పెద్ద బోర్డర్ ప్రాంతాలను విజిట్ చేస్తూ.. ఈ కట్టడాల వద్దకు రాబోగా చైనా సైనికులు అడ్డగించారు. ఈ భవనాల విషయమై వారిని అడగబోగా  సమాధానం చెప్పకుండా నిష్క్రమించారని, తనను వెళ్లిపొమ్మని చెప్పడంతో దూరం నుంచి తన సెల్ ఫోన్ తో ఈ భవనాల ఫోటో తీశానని ఆ ‘పెద్ద’ చెప్పాడు. ఇంతేకాదు.. అక్కడికి దగ్గరలోని  తమ ప్రాంతాలవద్దకు వెళ్లేందుకు కూడా నేపాలీయులను వారు అనుమతించడం లేదట.. కాగా ఇంత జరుగుతున్నా… నేపాల్ విదేశాంగ శాఖ దీనిపై తమకేమీ తెలియదని చెప్పడం కొసమెరుపు.