కాశ్మీర్.. కాశ్మీర్.. ఐరాసలో మళ్ళీ పాక్-చైనాలకు షాక్ !

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2020 | 12:35 PM

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తబోయి పాకిస్తాన్-చైనా మళ్ళీ బొక్క బోర్లాపడ్డాయి. తన తొత్తు చైనా అండతో పాకిస్తాన్ సదా ఐరాసలో ఈ అంశాన్ని ప్రస్తావించి భారత్ ను చిక్కుల్లో పడవేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ.. ఎన్నోసార్లు ఆ దేశానికి చుక్కెదురైంది. ఇప్పుడు కూడా తాజాగా-బుధవారం అదే పరిస్థితి ఏర్పడింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్సల్టేషన్ రూమ్ లో పాక్-చైనా దేశాలు ఈ సమస్యను ప్రస్తావించబోగా మెజారిటీ సభ్యదేశాలు దీనిపై చర్చించడానికి ఇది తగిన చోటు […]

కాశ్మీర్.. కాశ్మీర్.. ఐరాసలో మళ్ళీ పాక్-చైనాలకు షాక్ !
Follow us on

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తబోయి పాకిస్తాన్-చైనా మళ్ళీ బొక్క బోర్లాపడ్డాయి. తన తొత్తు చైనా అండతో పాకిస్తాన్ సదా ఐరాసలో ఈ అంశాన్ని ప్రస్తావించి భారత్ ను చిక్కుల్లో పడవేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ.. ఎన్నోసార్లు ఆ దేశానికి చుక్కెదురైంది. ఇప్పుడు కూడా తాజాగా-బుధవారం అదే పరిస్థితి ఏర్పడింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్సల్టేషన్ రూమ్ లో పాక్-చైనా దేశాలు ఈ సమస్యను ప్రస్తావించబోగా మెజారిటీ సభ్యదేశాలు దీనిపై చర్చించడానికి ఇది తగిన చోటు కాదని తోసిపుచ్చాయి. ఈ రూంలో జరిగిన క్లోజ్డ్ కన్సల్టేషన్స్ సందర్భంగా  పాక్ సూచనపై చైనా కాస్త ముందుకు వచ్చినా….   సభ్యదేశాలు ఇందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ రెండు దేశాలను తప్పు బట్టిన ఇండియా.. అసలు మీ దేశంతో సంబంధాలు మెరుగుపడాలంటే మొదట మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న మాట ఏమిటని ప్రశ్నించింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. పాక్ గానీ చైనా గానీ చేసే నిరాధారమైన ఆరోపణలను ఐరాసలో ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు.

కాశ్మీర్ అంశాన్ని భారత-పాకిస్తాన్ దేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని, అది వారి ఆంతరంగిక సమస్య అని యూరప్, ఫ్రెంచ్ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అటు-పాక్ ‘ వెన్నుదన్ను’ తో చైనా ఈ అంశాన్ని లేవనెత్తడం ఇది మూడోసారి. గత నెలలో ఆ దేశ యత్నాన్ని, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా వమ్ము చేశాయి. ఇప్పుడు తాజాగా.. పాక్,  చైనా దేశాలకు మళ్ళీ షాక్ తగిలింది.