మిర్చి రైతుకు ‘పంట’ పండింది..రూ. 20 వేలు దాటిన క్వింటాల్ ధర..!

| Edited By:

Jan 04, 2020 | 2:57 PM

రైతులు ఇది ఖచ్చితంగా కలే అనుకుంటారు. గత రెండు దశాబ్దాలలో ఎప్పుడు లేనంత రికార్డు ధరకు మిర్చి ధర చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి రూ.21 వేల వరకు పలుకుతోంది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో రైతుల మోముల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా, మలేషియా, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ దేశాల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ రావడంతో ధర రోజురోజుకు పెరిగిపోతోంది. గతేడాది వరకు వ్యవసాయం అంత ఆశాజనకంగా లేదు. కానీ భూముని వదిలి రైతు బ్రతకలేడు. […]

మిర్చి రైతుకు పంట పండింది..రూ. 20 వేలు దాటిన క్వింటాల్ ధర..!
Follow us on

రైతులు ఇది ఖచ్చితంగా కలే అనుకుంటారు. గత రెండు దశాబ్దాలలో ఎప్పుడు లేనంత రికార్డు ధరకు మిర్చి ధర చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి రూ.21 వేల వరకు పలుకుతోంది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ యార్డుల్లో రైతుల మోముల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా, మలేషియా, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ దేశాల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ రావడంతో ధర రోజురోజుకు పెరిగిపోతోంది. గతేడాది వరకు వ్యవసాయం అంత ఆశాజనకంగా లేదు. కానీ భూముని వదిలి రైతు బ్రతకలేడు. అందుకే కష్టమైనా, నష్టమైనా..నేలను దున్నకుంటూ సాగిపోతున్నాడు. ఎంత కష్టం చేసినాా, స్వేదం చిదించినా..ఏడాది చివరికి మిగిలేది అప్పులే. కానీ ఈ సంవత్సరం అదృష్టం కలిసొచ్చి వాణిజ్య పంటలైన మిర్చి, ప్రత్తి వంటివి అత్యధిక ధరలు పలుకుతున్నాయి.

ఒక ఏడాది మంచి ధర ఉంటే..దిగుబడి సరిగ్గా ఉండదు. మరో ఏడాది పంట బాగా పండితే..రేటు దక్కదు. కానీ ఈ ఏడాది దిగుబడితో..రేటు కూడా మంచి రైజ్‌లో ఉంది. తాలు మిరపకాయలు కొనేందుకు కూడా వ్యాపారులు ఎగబడుతున్నారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అత్యధికంగా తేజం రకం మిర్చి ధర రూ. 20 వేలు దాటి రూ. 25 వేల వైపు పరిగెడుతుంది. మిర్చి అధికంగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో గతేడాది అక్టోబర్ మాసంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ దిగుబడి తగ్గింది.