‘పిల్లలూ ! దేవుడూ… చల్లనివారే !’ ‘కరోనా సోకనివారే’ !

| Edited By: Anil kumar poka

Mar 03, 2020 | 2:16 PM

చైనాలో కరోనా రోగులపై ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించగా.. ఓ వింత వాస్తవం వెల్లడైంది. అదేమిటంటే.. 10 ఏళ్ళ లోపు పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకింది కేవలం ఒక శాతం కన్నా తక్కువ మందికేనట.. అంటే పిల్లల్లో ఈ  వైరస్ నిరోధక శక్తి పెద్దవారిలో కన్నా ఎక్కువగా ఉంటుందని తేలింది.

పిల్లలూ ! దేవుడూ... చల్లనివారే ! కరోనా సోకనివారే !
Follow us on

చైనాలో కరోనా రోగులపై ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించగా.. ఓ వింత వాస్తవం వెల్లడైంది. అదేమిటంటే.. 10 ఏళ్ళ లోపు పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకింది కేవలం ఒక శాతం కన్నా తక్కువ మందికేనట.. అంటే పిల్లల్లో ఈ  వైరస్ నిరోధక శక్తి పెద్దవారిలో కన్నా ఎక్కువగా ఉంటుందని తేలింది. వారికి ఇన్ఫెక్షన్ సోకినా దాని తీవ్రత ఎక్కువగా ఉండదని, కానీ వారి నుంచి పెద్దలకు మాత్రం సులువుగా సోకుతుందని నిపుణులు కొందరు చెబుతున్నారు. చైనాతో బాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది క రోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు సుమారు మూడు వేలమంది మృతి చెందినట్టు అంచనా. కానీ పిల్లలు మాత్రం ఈ వ్యాధికి దూరంగా ఉన్నారు. చైనాలో 10 లేదా 9 ఏళ్ళ లోపు బాల బాలికల్లో ఎవరూ కరోనాకు గురై మరణించలేదని తెలుస్తోంది. తమ లోని రోగ నిరోధక శక్తి ద్వారా కరోనా వైరస్ పాథోజిన్స్ ను వీరు ఎదుర్కోగలుగుతారని, సుమారు 45 వేల మంది పిల్లల్లో 416 మందికి మాత్రమే 0.9 శాతం ఇన్ఫెక్షన్ సోకిందని రీసెర్చర్లు కనుగొన్నారు. ఆయా రోగులపై వీరు ఇంత పెద్దఎత్తున అధ్యయనం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇన్ఫెక్షన్ కి గురైన 549 మందిలో 10-19 ఏళ్ళ మధ్య వయస్సువారు ఒక్కరు మాత్రమే మృతి చెందారని ఈ స్టడీలో వెల్లడైంది. పైగా 40ఏళ్ళ లోపు వారిలో కరోనా బాధితుల మరణాలకు సంబంధించి రెండు శాతం మాత్రమే నమోదయింది. అలాగే 60-79 ఏళ్ళ మధ్య వయస్సువారిలో ఈ రిస్క్ 30 శాతం పైగా ఉన్నట్టు అంచనా వేశారు. ఏది ఏమైనా.. పిల్లల్లో పెరిగిన రోగ నిరోధక శక్తికి ఖఛ్చితమైన కారణాలను మాత్రం ఇంకా నిర్ధారించలేకపోతున్నారు.