నీటి సంపులో పడి ఏడాదిన్నర పాప మృతి

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి ఏడాదిన్నర పాప చనిపోయింది.

నీటి సంపులో పడి ఏడాదిన్నర పాప మృతి
childrens missing

Updated on: Oct 30, 2020 | 5:02 PM

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి ఏడాదిన్నర పాప చనిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన స్వప్న దసరా పండుగ సందర్భంగా ఇటీవల  రామాంజపురంలోని పుట్టింటికి వచ్చింది. గురువారం సాయంత్రం స్వప్నతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పనుల్లో వారు నిమగ్నమవగా చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి ప్రాణాలు విడిచింది. అప్పటివరకు తమ కళ్లముందే అంబాడుతూ తిరిగిన చిన్నారి ఆకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. మృతదేహాన్ని స్వగ్రామం దత్తప్పగూడేనికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.

Also Read :

ఇండియాలో పబ్జీ ఖతం..నేటి నుంచి వారికి కూడా నో ఛాన్స్

Kajal Marriage : వైరల్ అవుతోన్న కాజల్ తీన్మార్ డ్యాన్స్

‘కలర్ ఫొటో’ టీమ్‌కు మాస్ రాజా ప్రత్యేక అభినందనలు