తెలంగాణలో కొండెక్కిన చికెన్.. ‘కోత’కు రంగం సిద్ధం..

| Edited By:

May 17, 2020 | 4:21 PM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని

తెలంగాణలో కొండెక్కిన చికెన్.. కోతకు రంగం సిద్ధం..
Follow us on

Chicken rates: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి తగ్గించడంతో కోళ్ల లభ్యత లేకుండా పోయింది. ఇక హైదరాబాద్ లో కేజీ చికెన్ రూ. 250 వరకు పలుకుతోంది. రంజాన్ నెలలో చికెన్ వినియోగం పెరగడం కూడా రేటు పెరిగేందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

భారీగా పెరుగుతున్న ధరలను అదుపుచేయడానికి.. హైదరాబాద్ లో మటన్ ధరను ఇప్పటికే ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఇక చికెన్ ధరలను ఫిక్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. గత వారం రోజుల్లో చికెన్ ధర దాదాపు రూ. లు పెరిగిన నేపథ్యంలో ధర కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఇప్పటికే మటన్ ధరను రూ. 700గా ఫిక్స్ చేసి.. అంతకుమించి అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక చికెన్ ధర ఇప్పటికే రూ. 250 పై చిలుకు ఉండటం తెలిసిందే.

కాగా.. రోజురోజుకు పెరుగుతున్న నాన్ -వెజ్ ధరలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఈ అంశంపై పశు సంవర్ధక శాఖ సమీక్ష నిర్వహించనుంది. చికెన్ తక్కువ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎంత ధరకు విక్రయించాలనే అంశంపై ఓ నిర్ణయం కూడా తీసుకోనున్నారు.