చెన్నైకి బ‌య‌లుదేరిన రైనా…

ఐపీఎల్ జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ముంద‌స్తుగా శిక్ష‌ణ శిబిరం ప్రారంభించనుంది.చెన్నై సూపర్ కింగ్స్ ఆట‌గాళ్లు సురేశ్ రైనా, దీప‌క్ చాహ‌ర్‌, పియూష్ చావ్లా, బ‌రింద‌ర్ శ్రాణ్ , చెన్నైకి చేరుకుంటున్నారు.

చెన్నైకి బ‌య‌లుదేరిన రైనా...

Updated on: Aug 14, 2020 | 7:00 PM

Suresh Raina Leaves for Chennai : మరికొద్ది రోజుల్లో కలర్ ఫుల్ గేమ్ ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఇందు కోసం ఐపీఎల్ జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ముంద‌స్తుగా శిక్ష‌ణ శిబిరం ప్రారంభించనుంది. ఇందు కోసం ఆ జట్టు సభ్యులు చెన్నైకు బయలు దేరారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆట‌గాళ్లు సురేశ్ రైనా, దీప‌క్ చాహ‌ర్‌, పియూష్ చావ్లా, బ‌రింద‌ర్ శ్రాణ్ , చెన్నైకి చేరుకుంటున్నారు. వ‌చ్చే నెల 19 నుంచి యూఏఈ వేదిక‌గా జ‌రుగనున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 13 వ సీజ‌న్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ఆగ‌స్టు 15 నుంచి 20 వ‌ర‌కు చెపాక్ స్టేడియంలో ధోనీ సేన ప్రాక్టీస్ చేయ‌నుంది.

ఇందుకోసం ఈ న‌లుగురు ఆట‌గాళ్లు విమానంలో చెన్నైకి బ‌య‌లుదేరారు. ఆట‌గాళ్ల‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన రైనా `చెన్నైకి బ‌య‌లుదేరాం. ధ‌న్య‌వాదాలు… విస్తారా.. మ‌మ్మ‌ల్ని చెన్నై తీసుకెళ్తున్నందుకు` అని పోస్ట్ చేశారు. ఈ శిబిరం కోస‌మే తాజాగా MS ధోనీ క‌రోనా వైర‌స్ ప‌రీక్ష చేయించుకోగా.. అందులో నెగిటివ్ అని తేలింది. రేప‌టి నుంచి ఆరు రోజుల పాటు దేశీయ ఆట‌గాళ్ల కోసం ప్ర‌త్యేక క్యాంప్ నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న ధోనీదేనని ఫ్రాంచైజీ యాజ‌మాన్యం తెలిపింది.