Check Movie Will be Releasing On: నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ‘చెక్’ సినిమా విడుదలపై ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా, లాక్‌డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ వాయిదా పడడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఇక తాజాగా చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం ‘చెక్’ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నితిన్ – చంద్రశేఖర్ ఏలేటి కలయిక నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది’ అని చెప్పుకొచ్చాడు. మరి ‘చెక్’ సినిమా నితిన్ కెరీర్‌కు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఒక నేరస్థుడిగా కనిపించనున్నాడు.
Also Read: Regina Cassandra : నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా.. సినీ జర్నీ పై హీరోయిన్ రెజీనా..