
Charlie Chaplin: నాలుగు పెళ్లిళ్లు…అంతులేని కష్టాలు… తినడానికి తిండి కూడా లేనంత పేదరికం… కన్నీటి చెమ్మను రెప్పల మాటున దాచుకోవడం ఆయనకు చిన్నప్పుడే అలవాటైపోయింది. ఆకలి తీరేందుకు నీళ్లు కూడా పనికొస్తాయన్న తత్వం పదేళ్లకే బోధపడింది. అయితే ఆవే ఆయనకు పాఠాలయ్యాయి. కన్నీటి విలువ… కొన్ని సార్లు అది పెట్టే క్షోభ అనుభవించిన ఆయన.. తనను తాను ఈ ప్రపంచానికి నవ్వుల నటుడిగా పరిచయం చేసుకున్నాడు. మాటల్లేని చిత్రాల్లో తన హావభావాలతోనే నవరసాలను పండించి వీక్షకులకు ఆనందామృతాన్ని పంచాడు. ఆనందం అనుభవించేందుకు మనసు భాష వస్తే చాలని నిరూపించిన ఆయన ఈ ప్రపంచానికి నవ్వులరాజుగా చెరిగిపోని జ్ఞాపకమయ్యాడు. అతడు మరేవరో కాదు..ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నటుడు. సుప్రసిద్ధ హాస్య బ్రహ్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, గాయకుడు, యుద్దాన్ని ఎల్లప్పుడూ విమర్శించిన శాంతిప్రియుడు చార్లి చాప్లిన్. ఒకవైపు వెండితెర ప్రస్థానం వెలుగులతో కొనసాగుతుండగానే, అతడి వ్యక్తిగత జీవితం, వైవిహిక పొరపాట్లతో ముడిపెడుతూ సాగింది. అందుకే నాలుగు పెళ్లిళ్లు, 11 మంది సంతానంతో చాప్లిన్ జీవితం మరోవైపు వివాదాస్ప కోణానికి దర్పణం పట్టింది. ఆయన జీవితంలో ప్రతి అడుగు విశేషమే. కొన్నిసార్లు ఏటికి ఎదురీదారు. మరి కొన్ని సార్లు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇంకొన్ని సార్లు తానే సంద్రమయ్యారు. అలాంటి నవ్వుల రాజు పుట్టుక నుంచి మరణం వరకు అతని జీవితం ఎన్నో మలుపులతో సాగింది..ఇప్పటి వరకు చాలా మందికి తెలియని చార్లీ చాప్లిన్ జీవిత రహస్యాలు, విశేషాలు...