Tollywood: ఇది కదా అసలైన సక్సెస్ అంటే.. అప్పుడు జీతం రూ.1500.. ఇప్పుడు ఒక్క సినిమాకు 12 కోట్లు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..
ఒకప్పుడు మొదటి జీతం రూ.1500 తీసుకున్న ఆ అందాల తార.. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.12 కోట్లు వసూలు చేస్తుంది. మోడిలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఒకప్పుడు ఆమె ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది. అప్పట్లో కుర్రాళ్ల ఆరాధ్య దేవత. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లుగా గట్టిపోటీనిస్తుంది. ఇంతకీ ఆ తార ఎవరా అనుకుంటున్నారా.. ?

సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోస్ ఒకప్పుడు సాధారణ ఉద్యోగాలు చేసుకునేవారే. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ సైతం ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి..అనేక కష్టాలను ఎదుర్కొని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అందులో ఈ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు మొదటి జీతం రూ.1500 తీసుకున్న ఆ అందాల తార.. ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.12 కోట్లు వసూలు చేస్తుంది. మోడిలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఒకప్పుడు ఆమె ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది. అప్పట్లో కుర్రాళ్ల ఆరాధ్య దేవత. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లుగా గట్టిపోటీనిస్తుంది. ఇంతకీ ఆ తార ఎవరా అనుకుంటున్నారా.. ? తనే ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. నటికాకముందు ఆమె మోడల్ అని అందరికి తెలిసిందే.
1992లో మోడలింగ్ చేసింది. అప్పట్లో ఒక్క షూట్ కోసం రూ.1500 తీసుకునేదట. 1994లో మిస్ వరల్డ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి.. విజేతగా నిలిచింది. ఆ తర్వాత మూడేళ్లకు డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది ఔర్ ప్యార్ హో గయా సినిమాతో హిందీ మూవీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అందాల పోటీల్లో పాల్గొనే ముందు తనకు సినిమాల్లో నటించడానికి నాలుగు ఆఫర్లు వచ్చాయని ఐశ్వర్యరాయ్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి వాటిని రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అదే రాజా హిందుస్తానీ. అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో సల్మాన్ సరసన హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాతో ఐశ్వర్య కెరీర్ మలుపు తిప్పింది.
ఇటు మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో సౌత్ ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో అప్పట్లోనే పాన్ ఇండియా సెలబ్రెటీగా ఫేమస్ అయ్యింది ఐశ్వర్య. ఎన్నో సినిమాలు, వాణిజ్య ప్రకటనలలో కనిపించిన ఐశ్వర్య.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఒక్క సినిమాకు రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ముంబైలో ఆమెకు రూ.21 కోట్ల విలువైన భవనాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు దాదాపు రూ.776 కోట్ల ఆస్తిని సంపాదించింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. వీరికి పాప ఆరాధ్య జన్మించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




