టీడీపీకి మరో షాక్.. రాజీనామా చేసిన సీనియర్ నేత

| Edited By:

Jul 09, 2019 | 7:21 PM

ఏపీలో టీడీపీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిచిపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, గత పదిహేనేళ్లనుంచి పార్టీలో పలు విభాగాల్లో పనిచేసిన చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన పార్టీ నాయకత్వంపై […]

టీడీపీకి మరో షాక్.. రాజీనామా చేసిన  సీనియర్ నేత
Follow us on

ఏపీలో టీడీపీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిచిపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, గత పదిహేనేళ్లనుంచి పార్టీలో పలు విభాగాల్లో పనిచేసిన చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన పార్టీ నాయకత్వంపై ఉన్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన సాంబశివరావు 2004లో దుగ్గిరాల నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. అయితే తనకు పార్టీలో సరైన ప్రాతినిథ్యం లభించలేదని.. ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారని సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆయన ఈనెల 14న బీజేపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇప్పటికే లంకా దినకర్ టీడీపీని వదిలి బీజేపీలో చేరారు.