యావత్ దేశం మీ వెంటే.. ఇస్రోకు జగన్, కేటీఆర్ ప్రశంస

| Edited By:

Sep 07, 2019 | 11:38 AM

భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్2. అయితే చివరి క్షణంలో ల్యాండర్‌ నుంచి సమాచారం తెగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 విక్రమ్ ల్యాండర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనం దాదాపుగా చంద్రుడిని చేరుకున్నామన్నారు. చివరి నిమిషంలో చిన్న వెనుకడుగే.. మన విజయానికి తొలిమెట్టు అవుతుందంటూ పేర్కొన్నారు. భారత ప్రజానీకం మొత్తం ఇస్రో వెంట ఉందన్నారు. చివరి ఘట్టంలో తలెత్తిన ఈ […]

యావత్ దేశం మీ వెంటే.. ఇస్రోకు జగన్, కేటీఆర్ ప్రశంస
Follow us on

భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్2. అయితే చివరి క్షణంలో ల్యాండర్‌ నుంచి సమాచారం తెగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 విక్రమ్ ల్యాండర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనం దాదాపుగా చంద్రుడిని చేరుకున్నామన్నారు. చివరి నిమిషంలో చిన్న వెనుకడుగే.. మన విజయానికి తొలిమెట్టు అవుతుందంటూ పేర్కొన్నారు. భారత ప్రజానీకం మొత్తం ఇస్రో వెంట ఉందన్నారు. చివరి ఘట్టంలో తలెత్తిన ఈ చిన్న ఎదురుదెబ్బను అధిగమించి.. భవిష్యత్తులో విజయాలుగా మలుచుకొని ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ ప్రయోగం కోసం ఎంతగానో శ్రమించిన ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.

ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తల అద్భుత కృషి ఈ దేశానికే గర్వకారణమన్నారు. త్వరలోనే గమ్యాన్ని చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యావత్ భారతం ఇస్రో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తుందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకు ముందు ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వారిలో దైర్యం నింపే ప్రయత్నం చేశారు.