చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి రాజమౌళిపై భారీ మెజార్టీతో చంద్రబాబు విజయం సాధించారు. 1989 నుంచి చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. టీడీపీకు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుపొందడం ఇది ఏడోసారి. వైసీపీ గాలి బలంగా వీయడంతో గతంలో కంటే ఈసారి చంద్రబాబు మెజార్టీ తగ్గింది.